పాదయాత్రలో అస్వస్థతకు గురైన బండి సంజయ్

  • నిన్న నారాయణ్ పేట్ మండలంలో కొనసాగిన బండి సంజయ్ పాదయాత్ర
  • వడదెబ్బకు గురైన సంజయ్
  • డాక్టర్ సూచన మేరకు కాసేపు విశ్రాంతి తీసుకున్న వైనం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన చేపట్టిన పాదయాత్ర నిన్న నారాయణపేట్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన వడదెబ్బకు గురయ్యారు. దీంతో, ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆయనకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, తనకు ఏదోలా ఉందని సంజయ్ చెప్పారని, వెంటనే చికిత్స అందించామని, ఇప్పుడు ఆయన పరిస్థితి బాగుందని చెప్పారు. రెస్ట్ తీసుకోవాలని ఆయనకు సూచించానని అన్నారు. 

మరోవైపు డాక్టర్ సూచన మేరకు బండి సంజయ్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. బీజేపీ నేత జలంధర్ రెడ్డి నివాసంలో రెస్ట్ తీసుకున్న అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు. ఈరోజు ఆయన పాదయాత్ర గొల్లపల్లి, దండు క్రాస్ ల మీదుగా కొనసాగనుంది. మక్తల్ టౌన్ లో బహిరంగసభను నిర్వహించనున్నారు.

Bandi Sanjay
Sun Stroke
BJP

More Telugu News